తెలంగాణ

telangana

ETV Bharat / crime

చెరువులోకి దిగి గొర్రెల కాపరి మృతి - shepherd died news

చెరువులోకి దిగి గొర్రెల కాపరి మృత్యువాతపడిన ఘటన కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

shepherd died
గొర్రెల కాపరి మృతి

By

Published : Mar 28, 2021, 4:19 PM IST

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం కొండపాకలో హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. గొర్రెలు కడిగేందుకు చెరువుకు వెళ్లి ఓ వృద్ధుడు గల్లంతయ్యాడు. గజ ఈతగాళ్ల సహయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని చెరువులో నుంచి బయటకు తీశారు.

కొండపాకకు చెందిన రాజమల్లు గొర్రెలను కడిగేందుకు చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని గ్రామస్థులు, గజ ఈతగాళ్ల సహయంతో చెరువులో గాలింపు చర్యలు చేపట్టి రాజమల్లు మృతదేహాన్ని బయకుతీశారు. మృతుడి బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి:చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం

ABOUT THE AUTHOR

...view details