తెలంగాణ

telangana

ETV Bharat / crime

సీసీ కెమెరాల మ్యాజిక్.. గంటల వ్యవధిలోనే బాలుడి కిడ్నాప్ కేసు సుఖాంతం - Kidnapping case of a boy in Secunderabad

Secunderabad Child Kidnap Case: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో బాలుడి కిడ్నాప్ కేసును సీసీ కెమెరాల ఆధారంగా రైల్వే పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినున్నట్లు తెలిపారు. నిందితురాలికి పిల్లలు లేకపోవడంతోనే ఈఘటనకు పాల్పడినట్లు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు.

Secunderabad Child Kidnap Case
Secunderabad Child Kidnap Case

By

Published : Sep 30, 2022, 12:15 PM IST

Updated : Sep 30, 2022, 2:46 PM IST

Secunderabad Child Kidnap Case: సికింద్రాబాద్‌లో ఓ మాయలేడి బాలుడిని అపహరించిన కేసును రైల్వే పోలీసులు గంటల వ్యవధిలోని ఛేదించారు. ఇందుకు సంబంధించిన వివరాలు రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఏడాది వయసున్న బాబును ఓ మహిళ కిడ్నాప్ చేసినట్టు సమాచారం వచ్చిందని చెప్పారు. సీసీ కెమెరాల ఆధారంగా బాబును కిడ్నాప్ చేసింది సోనీ అనే మహిళగా గుర్తించామని తెలిపారు.

మారగమ్మా అనే మహిళ గుంటూరు నుంచి సేడం వెళ్లడానికి నర్సాపూర్ ట్రైన్ ఎక్కిందని ఎస్పీ అనురాధ పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లో మారగమ్మకు సోనీ పరిచయమైందని తెలిపారు. తాను కూడా సేడం వెళ్తున్నానని చెప్పి ఆమెను నమ్మించిందని చెప్పారు. మారగమ్మ టికెట్ తీసుకోవడానికి క్యూలైన్​లో నిల్చున్న సమయంలో రద్దీ ఎక్కువగా ఉందని బాబును తాను పట్టుకుంటానని సోనీ చెప్పిందని అన్నారు.

దీంతో మారగమ్మ బాబును నిందితురాలికి ఇచ్చిందని తెలిపారు. పది నిమిషాల్లో మారగమ్మ టికెట్ తీసుకుని వచ్చే లోపు బాబును తీసుకుని సోనీ వెళ్ళిపోయిందని చెప్పారు. దీంతో ఆందోళన చెందిన మారగమ్మ పోలీసులకు సమాచరం ఇచ్చిందన్నారు. దీంతో వెంటనే ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. స్టేషన్​లో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి, గేట్ నెంబర్ ఒకటి వద్ద బాబును తీసుకు వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించామని ఎస్పీ పేర్కొన్నారు. వెంటనే లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా అలెర్ట్ చేసి, గణేష్ టెంపుల్ వద్ద నిందితురాలు తన బావతో ఆటో ఎక్కుతున్న సీసీటీవీ లభ్యమైందన్నారు. సీసీటీవీలో లభించిన ఆటో నెంబర్ ఆధారంగా ఆటో డ్రైవర్​ను ప్రశ్నించామన్నారు. కబాడీగూడలో మహిళతోపాటు బాబుని గుర్తించి రెండు గంటల్లోనే ఈ కేసును ఛేదించామని హర్షం వ్యక్తం చేశారు. నిందితురాలికి పిల్లలు లేకపోవడంతో ఇంట్లో గొడవలు అవుతూ ఉండేవి. ఈ కారణంతోనే నిందితురాలు బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిందని రైల్వే ఎస్పీ అనురాధ వెల్లడించారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తల్లి వద్ద ఉన్న బాబును మరియమ్మ అనే మహిళ అపహరించింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. స్టేషన్‌లో నుంచి బాలుడిని తీసుకువెళ్లిన మరియమ్మ ఆటోలో ఎక్కి పారిపోయిందని రైల్వే పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ద్వారా మరియమ్మను గుర్తించిన రైల్వే పోలీసులు బాబును సురక్షితంగా రక్షించారు. బాలుడిని బాధిత తల్లిదండ్రులకు అప్పగించినున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:బాల్క సుమన్ అభిమాని అత్యుత్సాహం.. ఏకంగా బుల్లెట్​లతోనే..!

సినిమా చూసి స్కెచ్​.. ప్రియుడితో కలిసి తండ్రి హత్య.. తల్లి సైతం ప్రోత్సాహం!

Last Updated : Sep 30, 2022, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details