తెలంగాణ

telangana

ETV Bharat / crime

నీటి వాల్వును ఢీకొన్న ద్విచక్రవాహనం... ఇద్దరు మృతి

వరంగల్‌ అర్బన్ జిల్లా‌ ఉప్పల్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మిషన్‌ భగీరథ నీటి వాల్వుకు ఏర్పాటు చేసిన రక్షక కవచాన్ని ద్విచక్రవాహనం ఢీకొట్టగా.. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Two killed in Mission Bhagiratha shield collision
మిషన్‌ భగీరథ రక్షక కవచాన్ని ఢీకొని ఇద్దరు మృతి

By

Published : Mar 12, 2021, 4:03 AM IST

మిషన్‌ భగీరథ నీటి వాల్వుకు ఏర్పాటు చేసిన రక్షక కవచాన్ని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఉప్పల్‌కు చెందిన పోతిరెడ్డి రాజు (26) తన బావమరిది కర్ర లిఖిత్‌ (17)తో కలిసి ద్విచక్ర వాహనంపై కమలాపూర్‌ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న మిషన్‌ భగీరథ నీటి వాల్వుకు ఏర్పాటు చేసిన ఇనుప చువ్వల రక్షక్ష కవచాన్ని ఢీ కొట్టారు.

ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలికి ఎస్సై విజయ్‌కుమార్ చేరుకొని మృతదేహాలను శవ పరీక్షల నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. లిఖిత్‌ స్వగ్రామం ఐనవోలు మండలం కానిపర్తికి చెందినట్లుగా తెలిసింది.

ఇదీ చూడండి:'మైనర్ బాలిక లైంగిక దాడి కేసును పర్యవేక్షించండి'

ABOUT THE AUTHOR

...view details