తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆ కుటుంబంలో విషాదం నింపిన కుక్క - Suryapeta District Latest News

సూర్యాపేట జిల్లా ముకుందాపురం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Avoid the dog and overturn the car
కుక్కను తప్పించబోయి కారు అదుపుతప్పి పల్టీ

By

Published : Mar 8, 2021, 11:13 AM IST

సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో కుక్కను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో జ్యోతి (40) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్తుండగా ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. కృష్ణ జిల్లా మచిలీపట్నం సమీపంలోని కూచిపూడికి చెందినవారుగా వెల్లడించారు.

మృతదేహాన్ని శవ పరీక్ష కోసం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ చూడండి:తెలంగాణ ఉద్యమకారుడు కొల్లూరు చిరంజీవి మృతి: సీఎం కేసీఆర్ సంతాపం

ABOUT THE AUTHOR

...view details