తెలంగాణ

telangana

ETV Bharat / crime

డివైడర్ పైకి ఎక్కి... డీసీఎంను ఢీకొట్టింది

మేడ్చల్ జిల్లా.. జీడిమెట్ల గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

The road accident took place at Jeedimetla village in Medchal district. The police who registered the case are investigating
డివైడర్ పైకి ఎక్కి... డీసీఎంను ఢీకొట్టింది

By

Published : Feb 28, 2021, 1:08 PM IST

మేడ్చల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీడిమెట్ల గ్రామ పరిధిలో తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో.. ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ పైకి ఎక్కి, అటుగా వెళ్తున్న డీసీఎంను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు కారుని అక్కడి నుండి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక... కారులో ప్రయాణిస్తున్న వారు మద్యం మత్తులో డ్రైవింగ్ చేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:అతివేగం: డివైడర్‌ను ఢీ కొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details