The police stopped the ambulance: ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్సీపీ నాయకుల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మహిళ కామాక్షి మృతదేహానికి కాకినాడ జీజీహెచ్లో పోస్టుమార్టం పూర్తయినా.. స్వగ్రామానికి తరలించకుండా పోలీసులు ఆపారు. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ కామాక్షి నిన్న మధ్యాహ్నం మృతి చెందగా.. ఇవాళ పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం 12:30 గంటల సమయంలో మృతదేహాన్నిఅంబులెన్సు వాహనంలోకి ఎక్కించగా.. పోలీసులు ఆ వాహనాన్ని ఆసుపత్రి బయటే మూడు గంటలకుపైగా నిలిపివేశారు.
కుటుంబ సభ్యులు ఎంత వేడుకున్నా పోలీసులు ఏ మాత్రం కనికరించ లేదు. మృతదేహాన్ని స్వగ్రామం తరలించాలంటూ మామిడితోటలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కాసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
అసలేం జరిగింది: తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం మామిడితోటలో రోడ్డు పక్కన 40 ఏళ్లుగా ఉంటున్న కామాక్షి ఇంటిని తొలగించటం కొత్త ఇల్లు మంజూరు చేయకపోవటంతో కొడుకుతో కలిసి పురుగు మందు తాగారు. చికిత్స పొందుతూ కామాక్షి చనిపోగా.. కుమారుడు మురళీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది.. గ్రామానికి చెందిన దుర్గారావు , అప్పారావు, వీర్రాజు భీమన్న చిత్రహింసలకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో తీసి పురుగు మందు తాగిన విషయం తెలిసిందే..