తెలంగాణ

telangana

ETV Bharat / crime

Suicide attempt at raj bhavan: 'మా కేసీఆర్​ దేవుడు.. ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తా.!' - hyderabad latest news

సీఎం కేసీఆర్​ దేవుడి లాంటి వ్యక్తి అని.. తమ నాయకుడిని విమర్శిస్తున్నారనే ఆవేదనతో రాజ్​ భవన్​ ఎదుట తెరాస కార్యకర్త(Suicide attempt at raj bhavan) ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన పోలీసులు అతడిని రక్షించారు.

suicide attempt at raj bhavan
రాజ్​భవన్​ ఎదుట ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 18, 2021, 6:12 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ను అకారణంగా విమర్శిస్తున్నారంటూ తెరాస కార్యకర్త(Suicide attempt at raj bhavan) ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. రాజ్​భవన్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్​లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్​ వద్ద సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో తెరాస నేతలు మహాధర్నా నిర్వహించారు. మహా ధర్నా అనంతరం తెరాస బృందం గవర్నర్​ తమిళిసై సౌందర రాజన్​కు వినతిపత్రం ఇవ్వడానికి బయలుదేరారు.

ఆ సమయంలో వారి వాహనాలు వచ్చే ముందు సూర్యాపేట జిల్లాకు చెందిన నాగార్జున అనే తెరాస కార్యకర్త(Suicide attempt at raj bhavan).. అకస్మాత్తుగా రాజ్ భవన్ ఎదుట రోడ్డుపైకి వచ్చి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఆటోలో ఆ ప్రాంతం నుంచి తరలించారు. దేవుడి లాంటి కేసీఆర్​ను విమర్శిస్తుంటే తాను తట్టుకోలేకపోతున్నానని నాగార్జున ఆందోళన వ్యక్తం చేశారు.

భాజపా నేతలు కన్నెర్ర చేస్తే కేసీఆర్​ మసై పోతారు అంటారా.. మా కేసీఆర్​ దేవుడి లాంటి వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి. మాకు దేవుడు. ఆయనను విపక్షాలు విమర్శిస్తుంటే తట్టుకోలేకపోతున్నా. ఆయన కోసం నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు అనుకున్నా. అందుకే ఆత్మహత్యకు యత్నించా. ఆయనను దూషిస్తే ఊరుకునేది లేదు. -నాగార్జున, సూర్యాపేట జిల్లా

తెలంగాణలో పండించిన ఖరీఫ్​ ధాన్యాన్ని(paddy procurement in telangana) కొనేది లేదని కేంద్రం చెప్పడంతో అధికార పార్టీ ఆందోళనకు దిగింది. ఎలా కొనరో చూస్తామంటూ.. ధర్నా చౌక్​ వద్ద ధర్నాలు నిర్వహించింది. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆధ్వర్యంలో ఈ రోజు 3 గంటలు పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు ధర్నాలో పాల్గొన్నారు. ధాన్యం కొనే వరకు నిరసనలు ఆపేది లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ముడి బియ్యాన్ని కొనడానికి సిద్ధమే కానీ.. ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఉప్పుడు బియ్యం నిల్వలు సరిపడా ఉన్నాయని.. ఇప్పుడు వాటి అవసరం లేదని తేల్చి చెప్పింది.

కేంద్రం భయపెడితే తాను భయపడతానా అని ముఖ్యమంత్రి కేసీఆర్(Telangana CM KCR) అన్నారు. తాను భయపడితే.. తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. వానాకాలం పంట కొంటారా.. కొనరా(paddy procurement) తేల్చిచెప్పాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. యాసంగిలో వరి వేయమంటారా.. ముక్కు నేలకు రాస్తారా అని అడిగారు. ఇది రైతుల జీవన్మరణ సమస్య అని పేర్కొన్నారు. కర్షకులు నష్టపోకూడదనే తెరాస ఆరాటమని.. అందుకే తమ ఈ పోరాటమని స్పష్టం చేశారు. ప్రతిగ్రామంలో చావుడప్పు కొడతామని అన్నారు. పోరాటం చేయడంలో దేశంలో తెరాసను మించిన పార్టీ లేదని ఉద్ఘాటించారు.

రాజ్​భవన్​ ఎదుట ఆత్మహత్యాయత్నం..

ఇదీ చదవండి:Venkatramireddy : వెంకట్రామిరెడ్డి రాజీనామాను ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ పిల్ దాఖలు

ABOUT THE AUTHOR

...view details