పాజిటివ్ అని తెలియగానే ప్రాణం వదిలిన వృద్ధుడు - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
కరోనా పరీక్ష చేయించుకున్నాడు. ఫలితం పాజిటివ్ అని వచ్చింది. అంతే ఇక అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు ఓ వృద్ధుడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
కరోనా పాజిటివ్ అని ప్రాణం వదిలిన వృద్ధుడు
కరోనా నిర్ధరణ పరీక్ష చేసుకునేందుకు వచ్చిన ఓ వృద్ధుడు పాజిటివ్ అని ఫలితం రాగానే ప్రాణం వదిలిన ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. అరెపల్లి గ్రామానికి చెందిన రేగొండ చంద్రయ్య అనే వృద్ధుడు కరోనా నిర్ధరణ పరీక్ష చేయించుకునేందుకు ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. పరీక్ష పురయి ఫలితం పాజిటివ్ అని తెలుసుకోగానే.. అక్కడిక్కడే మృతి చెందాడు. చంద్రయ్యకు పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు.