తెలంగాణ

telangana

ETV Bharat / crime

PFI కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని కస్టడీకి కోరిన NIA - NIA seeks custody of accused arrested in PFI case

The NIA has asked the Nampally court to remand the accused arrested in the PFI case
PFI కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని కస్టడీకి కోరిన NIA

By

Published : Sep 20, 2022, 5:32 PM IST

Updated : Sep 20, 2022, 5:44 PM IST

17:29 September 20

పీఎఫ్‌ఐ కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని కస్టడీకి కోరిన ఎన్‌ఐఏ

NIA seeks custody of accused arrested in PFI case పీఎఫ్‌ఐ కేసులో అరెస్టు చేసిన నిందితుల్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కస్టడీకి కోరింది. నలుగురు నిందితుల్ని 30రోజుల కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు ఎన్‌ఐఏ విజ్ఞప్తి చేసింది. సయ్యద్ సమీర్, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ ఉస్మాన్,ఇర్ఫాన్‌లను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నలుగురు నిందితులు పీఎఫ్‌ఐ కార్యకర్తలని పేర్కొంది. వీరిలో అబ్దుల్‌ ఖాదర్‌ను ప్రధాన నిందితుడిగా వెల్లడించింది.

ఉగ్రమూలాలు ఉన్నాయనే కోణంలో దేశవ్యాప్తంగా పీఎఫ్ఐ శిక్షణా కార్యక్రమాలపై నిఘా పెట్టిన అధికారులు... ఆదివారం నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో 38 చోట్ల సోదాలు నిర్వహించిన అధికారులు... పలు చరవాణీలు, పాస్ పోర్టులు, బ్యాంక్ ఖాతా పుస్తకాలు, డైరీలు స్వాధీనం చేసుకుని.. కోర్టుకు తీసుకొచ్చారు. ఎన్ఐఏ అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్న నలుగురిని సోమవారం హైదరాబాద్ నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. పలు కంప్యూటర్ హార్డ్​డిస్క్​లు, కీలక పత్రాలను కోర్టుకు సమర్పించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్​ఐ) కేసులో... తెలుగు రాష్ట్రాల్లో 40 చోట్ల అధికారులు ఆదివారం విస్తృత తనిఖీలు నిర్వహించారు.

ఇవీ చూడండి:

Last Updated : Sep 20, 2022, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details