నగరానికి చెందిన కీర్తన తన బిడ్డను తీసుకుని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి రాత్రి ఏడు గంటల సమయంలో తీసుకొచ్చింది. పాపకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన వైద్యం కోసం వార్డుకు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉన్న తల్లి... బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయింది.
ఉస్మానియా ఆస్పత్రిలో బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి - ఉస్మానియా ఆస్పత్రి
మానవత్వం, కన్న పేగు ప్రేమ మరచిన తల్లి... తన బిడ్డను ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిపోయిన వైనం ఉస్మానియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఉస్మానియా ఆస్పత్రిలో బిడ్డను వదిలేసి వెళ్లిన తల్లి
నిద్ర నుంచి మేల్కొన్న పాప ఏడ్వడంతో... ఆస్పత్రి సిబ్బంది తల్లి కోసం వెతికారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. ఆడపిల్ల అని వదిలించుకుందా? లేక ఇంకమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రస్తుతం పాపకు వైద్యులు మెరుగైన చికిత్సలు అందిస్తున్నారు.
ఇదీ చూడండి:'ప్రేమ పేరుతో పెళ్లి.. ఆ తర్వాత వ్యభిచారానికి ఒత్తిడి!'