నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పల్సి గ్రామ శివార్లలో అప్పుడే పుట్టిన అడపిల్లను చెత్తపొదల్లో వదిలేసి వెళ్లిపోయారు. పసికందు ఏడుపు కేకలు వినిపంచగా అటుగా వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ మహిళ దగ్గరికి వెళ్లి చూసింది. అప్పుడే జన్మించిన ఓ అడ శిశువుని గుర్తించింది. ఈ విషయం హుటాహుటిన గ్రామస్థులకు సమాచారం అందించటంతో అక్కడికి చేరుకున్నారు. అభం శుభం తెలియని ఆ పసికందును చూడడానికి వచ్చిన వారంతా అయ్యో పాపం తల్లి అని అంటున్నారు.
అప్పుడే పుట్టిన ఆడపిల్లను చెత్తపొదల్లో పడేసిన కిరాతకులు - nirmal district updates
నేనేం తప్పు చేశాను అమ్మ ...ఈ భూమిపై అడపిల్లగా జన్మించడం నా తప్పా ..నవమాసాలు మోసి కని ఇలా రోడ్డుపై పడేశావేంటమ్మా..నిర్మల్ జిల్లాలో పంటపొలాల్లో అప్పుడే పుట్టిన పసికుందు అవేదన ఇది.
ముళ్ల చెదలలో పాప