గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి పంచాయతీలోని చేదు గుట్ట తండాలో చోటుచేసుకుంది. తండాలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన చంద్రు నాయక్(59).. మంగళవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకు విందు భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుంది. దీంతో ఊపిరాడక చాలా సేపు ఇబ్బంది పడ్డారు. అతడిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. పరీక్షించిన వైద్యులు.. చంద్రు నాయక్ చనిపోయినట్లుగా నిర్ధరించారు.
గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే.. - mahabubnagar district news
మహబూబ్నగర్ జిల్లా కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని చేదు గుట్ట తండాలో అపశ్రుతి చోటుచేసుకుంది. శుభకార్యంలో జరిగిన విందులో భోజనం చేస్తుండగా గొంతులో మాంసం ముక్క ఇరుక్కుని వ్యక్తి మృతి చెందాడు.
![గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క.. తరువాత ఏమైందంటే.. person died by mutton piece](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13590463-181-13590463-1636513009348.jpg)
గొంతులో ఇరుక్కుపోయిన మాంసం ముక్క
చంద్రు నాయక్ మృతిచెందడంతో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఇదీ చదవండి:Adulterated Meat: ముక్క లేనిదే ముద్ద దిగదా..? అయితే జాగ్రత్త