నాగార్జునసాగర్ నుండి మాచర్ల వెళ్లే దారిలో ఉన్న నూతన వంతెనపై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్న కారణంతో మనస్తాపం చెందిన రామచంద్రయ్య(58) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కు చెందిన రామచంద్రయ్యకు ఎదురింటి వారితో వివాదం విషయంలో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్య - ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్య
ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగార్జునసాగర్-మాచర్ల వెళ్లే రహదారిలో ఉన్న వంతెనపై నుంచి దూకి తనువు చాలించాడు.
ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఈనెల 8వ తేదీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు విషయంలో మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు విచారణ జరిపినట్లు మృతుని భార్య తెలిపారు. ఈరోజు బయటకు వెళ్లి వస్తాను చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. ఈ కేసు విషయంలో రాజీకి పలుసార్లు ప్రయత్నం చేసినా ఎదుటి వారు వినలేదని ఆమె వాపోయారు. కేసు విషయంలో చాలా ఆవేదన చెందేవారని ఆమె తెలిపారు.