తెలంగాణ

telangana

ETV Bharat / crime

మాదకద్రవ్యాల సరఫరా కేసు.. కీలకసూత్రధారి ఎడ్విన్‌ అరెస్టు - edwin arrest in goa to hyderabad drugs supply case

Drugs Supplier Edwin Arrest: మాదక ద్రవ్యాల కేసులో కీలక నిందితుడు ఎడ్విన్‌ను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో తలదాచుకున్న అతడిని.. నిఘా వేసి పట్టుకున్నారు. గోవాలో 15 రోజుల నుంచి బస చేసిన నార్కోటిక్ విభాగం పోలీసులు.. పక్కా సమాచారం ప్రకారం ఎడ్విన్ తలదాచుకుంటున్న ఇంటిపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. మత్తు చాకెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ఓ ఫార్మా కంపెనీ అధినేత కుమారుడి గుట్టును కూడా పోలీసులు వెలుగులోకి తెచ్చారు.

Drugs Supplier Edwin Arrest
Drugs Supplier Edwin Arrest

By

Published : Nov 5, 2022, 12:17 PM IST

Updated : Nov 5, 2022, 7:39 PM IST

మాదకద్రవ్యాల సరఫరా కేసు.. కీలకసూత్రధారి ఎడ్విన్‌ అరెస్టు

Drugs Supplier Edwin Arrest: గోవా నుంచి.. దేశంలోని పలు ప్రాంతాలకు ఎడ్విన్ మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆగస్టు 17న నారాయణ బోర్కర్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడు చెప్పిన సమాచారం ఆధారంగా గోవాకు చెందిన ఆరుగురిపై కేసు నమోదు చేశారు. ఆరుగురు కలిసి పలువురు ఏజెంట్ల ద్వారా డార్క్‌వెబ్‌లో మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు తమ దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. ఇప్పటికే జాన్సన్ డిసౌజా, నరేంద్ర ఆర్యలను అరెస్ట్ చేశారు. సముద్ర మార్గంలో దక్షిణాఫ్రికా, నైజీరియా నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి.. హైదరాబాద్, గోవా, బెంగళూరు, ముంబై, దిల్లీలో విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ అధినేత కుమారుడు.. ఇంట్లో తెలియకుండా చేస్తున్న మత్తు దందాను పోలీసులు ఛేదించారు. చాక్లెట్లలో గంజాయి ఆయిల్‌ను కలిపి విక్రయిస్తున్నాడని.. ఇతని వినియోగదారుల్లో అమ్మాయిలే సగం మంది ఉండటం విస్మయం కల్పించిందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా.. పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలని సీపీ ఆనంద్‌ కోరారు.

Last Updated : Nov 5, 2022, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details