జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థినికి 7 నెలల గర్భం ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆమెను శిశు సంక్షేమ అధికారులు స్టేట్ హోమ్‌కు తరలించారు. ఆమె తల్లితండ్రులు ముంబయిలో ఉంటుండగా... ఆమె అక్క ఇంట్లో ఉంటూ ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుతోంది.
గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని... - jagtial district latest news
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థిని గర్భవతి అయింది. ఆ విద్యార్థిని 7 నెలల గర్భవతి అని తెలియగానే... పాఠశాల ఉపాధ్యాయులు శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చారు.
![గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని... the-incident-where-a-student-of-an-ashram-school-in-kodimyala-mandal-of-jagittala-district-became-pregnant-created-a-sensation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11093448-927-11093448-1616288128205.jpg)
గర్భం దాల్చిన పదో తరగతి విద్యార్థిని... స్టేట్ హోమ్ తరలింపు
లాక్ డౌన్ తర్వాత పాఠశాలలు తెరవటంతో ఈ మధ్యనే పాఠశాలలో చేరింది. ఆమె అనారోగ్యంగా కనిపించటంతో ఉపాధ్యాయులు శిశు సంక్షేమ అధికారులకు సమాచారం ఇచ్చి విద్యార్థినిని ఇంటికి పంపారు. శిశు సంక్షేమ అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె కడుపులో 7 నెలల గర్భం ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ఈ ఘటనపై అధికారులు ఆరా తీయగా ఆమె బావ ఈ పని చేసినట్లు అధికారులకు తెలిపింది.
ఇదీ చదవండి:నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం తెరాస కైవసం
Last Updated : Mar 21, 2021, 9:02 AM IST