హైదరాబాద్ మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోడ కూలి ఓ వ్యక్తి మృతి చెందారు. ఆర్ఆర్జీ వైన్స్ షాప్ ముందు రోడ్డు విస్తరణ పనులు జరుగుతుండగా జేసీబీ తగిలి దాని పక్కనే ఉన్న గోడ కూలి... మందు కోసం వచ్చిన వ్యక్తిపై పడింది. దీంతో అతను అక్కడిక్కడే మరణించగా.. మరో నలుగురికి గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
మందు కోసం వచ్చాడు.. మరణించాడు - telangana news
మందు కోసం వచ్చిన వ్యక్తి గోడ కూలి మృతి చెందిన ఘటన మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా జేసీబీ తగిలి గోడ కూలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![మందు కోసం వచ్చాడు.. మరణించాడు The incident took place within the confines of Madhapur police station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10641762-28-10641762-1613410035078.jpg)
మందు కోసం వచ్చాడు.. మరణించాడు
మృతుడు అసోంకు చెందిన ఇనాముల్ హూస్సేన్గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :ప్రతిధ్వని: రక్తమోడుతున్న రహదారులు.. ఘోర ప్రమాదాలకు కారణాలేంటి ?