తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్వింటాళ్ల కొద్ది చేపలు మృతి.. విష ప్రయోగమే కారణమా..?

మెదక్ జిల్లాలోని ఆర్ వెంకటాపురం గ్రామంలో.. క్వింటాళ్ల కొద్ది చేపలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. విష ప్రయోగంతోనే చేపలు మృత్యువాత పడ్డాయంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

fishes died suspiciously
fishes died suspiciously

By

Published : Jun 10, 2021, 6:09 PM IST

సుమారు 20 క్వింటాళ్ల చేపలు అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డ ఘటన మెదక్ జిల్లాలోని ఆర్ వెంకటాపురం గ్రామంలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడంతోనే చేపలు మరణించినట్లు స్థానిక మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.

కుంటలో విషం కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేశారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి:స్టార్​ హోటల్​లో లగ్జరీ కారును కొట్టేశాడు..

ABOUT THE AUTHOR

...view details