కరోనా పాజిటివ్ వచ్చిందని ఓ వ్యక్తి మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో చోటు చేసుకుంది.
కరోనా పాజిటివ్ వచ్చిందని ఉరేసుకున్నాడు - wanaparthy latest news
కొవిడ్ సోకిందని మనస్థాపానికి గురై ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో చోటు చేసుకుంది.
వనపర్తి జిల్లా దేవరకద్ర మండలం గోపన్ పల్లికి చెందిన కోట్ల రఘుపతి రెడ్డి (65 ) నాలుగు రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం వైద్య పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.ఇంటికి వచ్చిన ఆయన మధ్యాహ్నం వెళ్లిపోయాడు. రాత్రి వరకు వెతికిన ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం ఉదయం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా సాలెపేట సమీపంలో ఉన్నట్టు గుర్తించారు. అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే లుంగీతో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగశేఖర రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:వివాహితపై ముగ్గురు కామాంధుల అఘాయిత్యం!