అక్కున చేర్చుకుని ఆదరణ చూపాల్సిన అన్నదమ్ములే.. సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. మానవ సంబంధాలను మంట కలుపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో.. చాలా కాలంగా వేధింపులు భరించిన ఓ బాధితురాలు.. చివరకు పోలీసులను ఆశ్రయించింది.
భద్రాచలంలోని సీతారామ నగర్ కాలనీకి చెందిన.. సాయి కుమార్(55), అతని తమ్ముడు మనోహర్ (33)లకు వివాహం జరగకపోవడంతో ఇంట్లోనే తల్లితో కలిసి ఉంటున్నారు. తండ్రి చనిపోగా పెళ్లి కాని ఆ బాధిత మహిళ(35) కూడా ఇద్దరు సోదరులతో సహా ఆ ఇంట్లోనే నివాసముంటోంది. ఈ నేపథ్యంలో కొన్ని సంవత్సరాలుగా అన్నదమ్ములిద్దరూ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని సదరు మహిళ ఆరోపిస్తోంది.