తెలంగాణ

telangana

ETV Bharat / crime

విషాదం: విద్యుదాఘాతంతో రైతు మృతి - కరెంట్ షాక్ తో రైతు మృతి

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో విషాదం చోటుచేసుకుంది. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఓ రైతు.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

farmer died
farmer died

By

Published : Jun 20, 2021, 8:50 PM IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అబ్దుల్ రహీం.. రోజులాగే పొలానికి వెళ్లాడు. పంటకు నీరు అందించే క్రమంలో.. కరెంట్​ షాక్​కు గురై ప్రాణాలు విడిచాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు విగత జీవిగా పడి ఉన్న రహీంని చూసి బోరున విలపించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.

ఇదీ చదవండి:విషాదం: చెరువులో మునిగి తాతా మనుమడు మృతి

ABOUT THE AUTHOR

...view details