మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామ శివారులో ప్రమాదవశాత్తు ఓ ఆవు మృతి చెందింది. భజనా తండాకు చెందిన హనుమాన్ వ్యవసాయ క్షేత్రంలో ఈదురుగాలుల ప్రభావంతో తెగిపడ్డ కరెంట్ తీగలు తగిలి.. గోవు విద్యుదాఘాతానికి గురైంది. ఈ ఘటనలో మూగజీవి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. యాజమాని కుటుంబ సభ్యులు ఆవు మృతదేహంపై పడి కన్నీరుమున్నీరుగా విలపించడం స్థానికులను కలచివేసింది.
విద్యుదాఘాతంతో ఆవు మృతి
విద్యుదాఘాతంతో ఆవు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఈదురుగాలులకు విరిగి పడ్డ విద్యుత్ స్తంభాల వల్లే.. ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
విద్యుదాఘాతంతో ఆవు మృతి
రెండు రోజుల క్రితం గాలి దుమారం సంభవించినప్పుడు విద్యుత్ తీగలు తెగిపడ్డాయని స్థానికులు తెలిపారు. అధికారులు కూలిపోయిన స్తంభాల వైపు విద్యుత్ సరఫరాను నిలిపివేయలేదంటూ మండిపడ్డారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఇదీ చదవండి:మందేసి..హోర్డింగ్ ఎక్కి..రచ్చరచ్చ