నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ గ్రామంలో ఈదమ్మ జాతరకు వచ్చిన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఒకరిపై ఒకరు బీరు సీసాతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయలవ్వగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్సకోసం వారిని మహబూబ్‌నగర్‌లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
ఈదమ్మ జాతరలో ఘర్షణ.. ఇద్ధరి పరిస్థితి విషమం - eedamma festivity news
మద్యం మత్తులో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని ఈదమ్మ జాతరలో జరిగింది. ఈ ఘర్షణలో గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యలు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం వారిని మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.
![ఈదమ్మ జాతరలో ఘర్షణ.. ఇద్ధరి పరిస్థితి విషమం The hustle and bustle of young people who drank alcohol at the Idamma fair](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10848276-853-10848276-1614742685317.jpg)
ఈదమ్మ జాతరలో ఘర్షణ.. ఇద్ధరి పరిస్థితి విషమం
ఈ ఘటనతో జాతరకు వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. జాతరలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగుతున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం కారణంగానే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది