సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెంలో దారుణం చోటుచేసుకుంది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త.. భార్యపై అనుమానం పెంచుకుని కత్తితో దాడి చేశాడు.
Murder Attempt News: అనుమానం.. పెనుభూతమై.. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త - అనుమానం.. పెనుభూతమై.. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
అనుమానం పెనుభూతమైంది... కట్టుకున్న భార్యపై దాడి చేసేలా (Murder Attempt News)చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేపట్టారు.
![Murder Attempt News: అనుమానం.. పెనుభూతమై.. భార్యపై కత్తితో దాడి చేసిన భర్త the-husband-who-attacked-the-wife-with-a-knife](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13236672-thumbnail-3x2-kee.jpg)
ఇదీ జరిగింది...
కట్టుకొమ్ము గూడెం గ్రామానికి చెందిన శ్రీలతకు విజయవాడకు చెందిన అనిల్‌తో.. పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. తరచు గొడవ పడేవాడు. శ్రీలత తల్లిగారింటికి వచ్చి.. ఉంటుంది. కట్టుకొమ్ము గూడెంలోని అత్తగారింటికి వచ్చి... భర్త అనిల్ భార్యపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అనిల్‌కు దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. శ్రీలతకు తీవ్ర రక్తస్రావం కావడంతో.. 108 ద్వారా కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చిలుకూరు ఎస్సై తెలిపారు. దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.