Husband murdered Wife: మద్యానికి బానిసైన భర్త... ఆ మత్తులోనే భార్యను హత్య చేసి... తానూ ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన సంజీవులు... భార్య రమ్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న గొడ్డలితో ఆమెపై దాడి చేశాడు. రమ్య అక్కడికక్కడే మృతిచెందింది. భార్యను నరికిన గొడ్డలితోనే... సంజీవులు తన తలపై నరుక్కుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
భార్యను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త, అదే కారణమా - భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
Husband murdered Wife మద్యానికి బానిసైన భర్త తాగిన మైకంలో భార్యను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు గురైన భార్య ప్రసుత్తం ఐదు గర్భిణీ కాగా ఇప్పటికే ఏడాదిన్నర పాప ఉంది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రక్తమోడుతూ ఉన్నప్పుడే పొలం వద్ద ఉన్న తండ్రిపై దాడి చేసేందుకు వెళ్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. స్థానికులపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం గ్రామ శివారులో పడిపోయిన సంజీవులును కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. హత్యకు గురైన రమ్య ఐదు నెలల గర్భిణి కాగా.. ఇప్పటికే ఏడాదిన్నర పాప ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మద్యానికి బానిసగా మారిన సంజీవులు... తరచూ భార్యతో గొడవ పడుతుండే వాడు. ఈ క్రమంలోనే ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఇవీ చదవండి: