Grandmother killed her grandson: పుట్టిన పిల్లలకు దగ్గరుండి అన్నీ అమ్మమ్మనే చూసుకుంటుంది. స్నానం చేయిస్తోంది. ఒడిలో పడుకోపెట్టి ఉగ్గుపోస్తోంది. తన మనవడు/మనవరాలి కోసం నిజంగా చెప్పాలంటే అమ్మ కంటే ఎక్కువగా సేవలు చేసేది అమ్మమ్మనే. పుట్టిన దగ్గర నుంచి పెద్దైన వరకు ప్రతి సెలవులకి అమ్మమ్మ ఇంటికి వెళుతూ ఉంటాము. తన మనవడు/మనవరాలు చిన్నారిగా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, పెద్దైన తరవాత కూడా అంతే జాగ్రత్తలు చెబుతూనే ఉంటుంది. వారికి ఎంత చేసిన తనకు ఇది కావాలని అడిగే మనసు ఆ మాతృమూర్తికి ఉండదు. అయితే ఇది నిజమైన మనసు, ప్రేమ ఉన్న అమ్మమ్మ కథ.
ఎంత పని చేశావే అమ్మమ్మా! అసలు ఎందుకు ఇలా చేశావు..
Grandmother killed her grandson: అమ్మమ్మ అనే పదానికి అర్థం అమ్మ తరవాత అమ్మ. ఈ అర్థానికి సరిగ్గా సరిపోయే విధంగానే అమ్మమ్మ చేసే చాకిరి అంతా ఇంతా కాదు. కోడలు గర్భిణిగా ఆరు నెలలు ఉండగానే తన అత్తామామ పుట్టింటికీ పంపించేస్తారు. ఎందుకంటే తమకన్నా వారి కన్నవారి ఇంటికి వెళితేనే బాగా చూసుకుంటారని నమ్మకం. అందుకు తగ్గట్టుగానే మహిళలు శిశువుకు జన్మనిచ్చిన తరవాత కూడా అమ్మమ్మ ఇంటి వద్దనే ఉంటూ ఆలనపాలన సాగిస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఆశ్చర్యకరమైన ఘటన ఒకటి జరిగింది.. ఏంటా అని ఆలోచిస్తున్నారా.. చూడండి?
ఇప్పుడు చెప్పే అమ్మమ్మ కథ వేరు.. ఎందుకంటే తన మనవడినే కడతేర్చిన కథ.. ఇది ఎక్కడో జరిగిందనుకుంటే పొరపాటే మన తెలంగాణలోనే జరిగింది. ఏంటీ మనవడిని ఆడించాల్సిన అమ్మమ్మ ఇలాంటి పనికి ఎలా ఒడిగట్టింది అని ఆశ్చర్యంగా ఉందా?. తాగిన మైకంలో ఈ ఘోరానికి పాల్పడింది. అభంశుభం ఎరుగని నెల రోజుల శిశువుని అమ్మమ్మే హత మార్చింది. ఈ దారుణమైన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకోంది. జిల్లాలోని సదాశివపేట పట్టణ పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ప్రాంతంలో తాగిన మత్తులో తన మనవడిని (ఒక్క నెల) అమ్మమ్మ చంపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి: