girl attacked by brother in ps: పోలీస్‌స్టేషన్‌లోనే చెల్లిని చంపబోయిన అన్న - ప్రేమికురాలిపై కుటుంబ సభ్యుల దాడి
13:57 January 11
ప్రేమికురాలిపై కుటుంబ సభ్యుల దాడి
girl attacked by brother in ps: ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోవూరులో దారుణం చోటుచేసుకుంది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోనే చెల్లెలిపై అన్న కత్తితో దాడి చేశాడు. ప్రేమ వివాహం నేపథ్యంలో స్టేషన్లో కౌన్సిలింగ్ జరుగుతుండగా.. యువతి అన్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. వెంటనే ఆమెను కోవూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కోవూరు మండలం కట్టకింద చెర్లోపాలెేనికి చెందిన అబ్బాయి అశోక్, బుచ్చిరెడ్డిపాళెం మండలం జండాదిబ్బకు చెందిన శిరీష.. కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఆ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకొని రక్షణ కల్పించాలంటూ కోవూరు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
దీంతో పోలీసులు.. ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడుతుండగా.. యువతి సోదరుడు హరీష్.. యువతిపై కత్తితో దాడి చేశాడు. గాయపడిన శిరీషను చికిత్స నిమిత్తం వెంటనే కోవూరు ఆస్పత్రికి తరలించారు. హరీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:Corona test guidelines: 'లక్షణాలు లేకుంటే కరోనా పరీక్ష అవసరం లేదు'