విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి గృహోపకరణాలు, క్వారీకి సంబంధించిన వస్తు సామగ్రి దగ్ధమైన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీది తండా గ్రామ పంచాయతీ పరిధిలోని... మిడ్ వెస్ట్ గ్రానైట్ క్వారీలో చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి క్వారీలోని షెడ్లో విద్యుదాఘాతం సంభవించి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
అగ్ని ప్రమాదం.. సుమారు 15 లక్షల నష్టం - Fire accident in quarry
మహబూబాబాద్ జిల్లాలో కరెంట్ షాక్‌తో మంటలు చెలరేగి గృహోపకరణాలు, క్వారీకి సంబంధించిన వస్తువులు ధ్వంసమయ్యాయి. శనివారం అర్ధరాత్రి జరిగిన ఘటనలో క్వారీలోని షెడ్డులో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో సుమారు 15 లక్షల ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.

షెడ్డులో క్వారీ వాహనాలకు సంబంధించిన ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్ డ్రమ్ములు ఉండటం వల్ల మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. క్వారీలో పనిచేసే ఉద్యోగులు, స్థానికులు మంటలను ఆర్పేందుకు ఎంత ప్రయత్నించినా అదుపులోకి రాలేదు. సుమారు 15 లక్షల రూపాయల ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. యజమాని అందుబాటులో లేకపోవడం వల్ల నష్ట వివరాలను అంచనా వేయలేకపోయామని గూడూరు ఎస్ఐ సతీశ్ తెలిపారు. దర్యాప్తు చేసి అగ్నిప్రమాదానికి గల కారణాలు, నష్టం తదితర విషయాలను తెలియజేస్తామని వెల్లడించారు.
ఇదీ చూడండి:జవహార్‌నగర్ ఆరో డివిజన్ కార్పొరేటర్‌పై అత్యాచారం కేసు