తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో సభ్య సమాజం సిగ్గుపడే ఘటన జరిగింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ తండ్రి.. కన్న కూతురి(8)తోపాటు వరుసకు కూతురయ్యే మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలికకు కడుపు నొప్పి రావడంతో విషయం బయటపడింది. దీంతో కసాయి తండ్రి అఘాయిత్యాల గురించి కన్న కుమార్తె బయటపెట్టింది.
కామంతో కళ్లు మూసుకుపోయిన తండ్రి.. కన్నబిడ్డతోపాటు మరో బాలికపై.. - కూతురిపై అత్యాచారం
తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే.. కామంతో కళ్లు మూసుకుపోయి సొంత కమార్తెతోపాటు మరో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు బాలికకు కడుపునొప్పి రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
rape
గ్రామస్థులు, కుటుంబసభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. డీఎస్పీ మురళీ మోహన్ ఆధ్వర్యంలో నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దిశా చట్టం, ఫోక్సో చట్టం, అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి:Fight between friends: స్నేహితుల మధ్య ఘర్షణ.. కత్తెరతో మెడపై దాడి