తెలంగాణ

telangana

ETV Bharat / crime

కొడుకుని అతి దారుణంగా హత్య చేసిన తండ్రి

కన్న కొడుకుని తండ్రే పొట్టనబెట్టుకున్న విషాద ఘటన సంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో జరిగింది. కూలీ డబ్బులతో తండ్రి మద్యం తాగడం వల్ల ఆగ్రహించిన కుమారుడు... తన తండ్రిని నిలదీశాడు. ఇద్దరిమధ్య మాటకుమాట పెరిగి హత్యకు దారితీసింది.

father murdered his son, murder at kothapalli, sangareddy
father murdered his son, murder at kothapalli, sangareddy

By

Published : May 11, 2021, 5:14 PM IST

తనను నిలదీశాడనే కారణంతో కన్న కొడుకనే మమకారం లేకుండా.. కర్రతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడో తండ్రి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కొత్తపల్లిలో జరిగింది.

గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్, భార్య పద్మ, వారి కుమారుడు సాయి కిరణ్ బాహ్య వలయ రహదారి వద్ద కూలిపని చేస్తూ ఉంటారు. అయితే ముగ్గురి కూలీ డబ్బులతో శ్రీనివాస్ గౌడ్ మద్యం తాగేశాడు.

ఇది తెలిసిన సాయి కిరణ్ తండ్రిని డబ్బుల కోసం నిలదీశాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో కన్న మమకారం కూడా మరిచి కొడుకుని తండ్రి కర్రతో గట్టిగా కొట్టాడు. సాయి కిరణ్ అక్కడికక్కడే చనిపోయాడు. గుమ్మడిదల పోలీసులు తండ్రి శ్రీనివాస్ గౌడ్​ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: తెలంగాణ నుంచి పొరుగు రాష్ట్రాలకు కల్తీ మద్యం సరఫరా

ABOUT THE AUTHOR

...view details