నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి
08:48 April 07
నీటిసంపులో పడేసి పసికందును చంపిన తండ్రి
8నెలల పసికందు... అభం శుభం తెలియని చిన్నారి. తండ్రి గుండెలపై ఆడుకోవాల్సిన ఆ పసికందును... కన్నతండ్రి చిదిమేశాడు. కంటికి రెప్పలా కాపాడాల్సిన నాన్నే... కడతేర్చాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లిలో భార్యాభర్తలు విక్రమ్,స్పందన నివసిస్తున్నారు. పెళ్లైన ఆరు సంవత్సరాలకు ఓ బాబు పుట్టాడు. విక్రమ్ హెయిల్ కటింగ్ షాప్లో పనిచేసేవాడు. మద్యానికి బానిసైన విక్రమ్... రోజు ఇంటికి వచ్చి గొడవపడేవాడు. మంగళవారం కూడా ఇంట్లో గొడవపడి కోపంతో ఆరునెలల పసికందును నీటిసంపులో పడేశాడు. ఆ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పసికందు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.