తెలంగాణ

telangana

ETV Bharat / crime

లేగదూడను రక్షించే ప్రయత్నంలో రైతు మృతి - telangana news

కాకతీయ ప్రధాన కాలువలో పడిన లేగదూడను రక్షించే ప్రయత్నంలో రైతు మృతి చెందిన ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో మృతుని ఆనవాళ్లు లభించలేదని పోలీసులు తెలిపారు. ఉద్ధృతి తగ్గిన అనంతరం మృతదేహాన్ని వెలికి తీస్తామని అన్నారు.

The farmer died while trying to save the calf
లేగదూడను రక్షించే ప్రయత్నంలో రైతు మృతి

By

Published : Mar 17, 2021, 4:27 AM IST

ప్రమాదవశాత్తు కాకతీయ ప్రధాన కాలువలో పడిన లేగదూడను కాపాడే ప్రయత్నంలో గుర్తు తెలియని ఓ రైతు మృతి చెందిన ఘటన వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండలో చోటుచేసుకుంది. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటం వల్ల మృతున్ని గుర్తించటం పోలీసులకు కష్టంగా మారింది.

నీటి ప్రవాహం తగ్గిన అనంతరం మృతదేహాన్ని వెలికి తీస్తామని పేర్కొన్నారు. మృతికి గల అసలు కారణాలు విచారణలో తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:బోరు సీజ్ ఘటన.. ప్రాణాపాయ స్థితిలో రైతు

ABOUT THE AUTHOR

...view details