వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చిరైతుపై ఓ డ్రైవర్ దాడి చేశాడు. వెంకటాపురానికి చెందిన రైతు మురళి మిర్చి బస్తాలను మార్కెట్‌కు తీసుకువచ్చారు. డీసీఎం డ్రైవర్ ఖాజా.. వాహనాన్ని మిర్చి బస్తాలపైకి ఎక్కించాడు. ఈ క్రమంలో డ్రైవర్‌కు రైతుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
మిర్చిరైతుపై డీసీఎం డ్రైవర్ దాడి.. - warangal enumamula agriculture maarket
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్చి రైతుపై డీసీఎం డ్రైవర్ దాడి చేశాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో చోటు చేసుకుంది. మిర్చి బస్తాలపైకి లారీ ఎక్కిన క్రమంలో ప్రారంభమైన గొడవ దాడి వరకు వెళ్లింది.
మిర్చి రైతుపై.. డీసీఎం డ్రైవర్ దాడి
సహనం కోల్పోయిన డీసీఎం డ్రైవర్ ఖాజా రైతుపై దాడి చేశాడు. తోటి రైతులు స్పందించి ఖాజాను ఆపే ప్రయత్నం చేయగా.. ఇనుప రాడ్‌తో భయభ్రాంతులకు గురిచేశాడు. విచక్షణ కొల్పోయి దాడికి పాల్పడిన డ్రైవర్‌పై ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్‌కు రైతులు ఫిర్యాదు చేశారు
ఇదీ చదవండి:గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు