జింకపై కుక్కలు దాడి చేసిన ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. మద్నూర్ మండల పరిధిలోని చిన్న తడుగుర్ శివారులో.. అడవి నుంచి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేస్తుండగా రైతులు అప్రమత్తమై వాటిని తరిమికొట్టారు.
కుక్కల దాడిలో జింకకు గాయాలు - crime news of telangana
అడవి నుంచి బయటకు వచ్చిన జింకపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల పరిధిలో చోటు చేసుకుంది.
జింకపై కుక్కల దాడి
గాయపడిన జింకకు రైతులు దాహం తీర్చి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వన్యశాఖ సిబ్బంది జింకను మద్నూర్ పశువైద్యశాలకు తరలించారు.
ఇదీ చదవండి:ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం... నిరవధిక వాయిదా