చెట్టుకు ఉరివేసుకుని కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో చోటు చేసుకుంది. అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని లింగమయ్య ఆలయానికి కిలోమీటర్ దూరంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని చూసిన అటవీ శాఖ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - An unidentified body was found in Nagar Kurnool district
చెట్టుకు ఉరివేసుకుని కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతంలో చోటు చేసుకుంది. గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశామని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని అన్నారు.
![కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం An unidentified body was found in Nagar Kurnool district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10587523-846-10587523-1613053475377.jpg)
కుళ్లిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా కుళ్లిపోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశామని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:ఘట్కేసర్ అత్యాచారం కేసులో నలుగురు అరెస్టు