నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన యువకుడు మృతిచెందాడు. ఇవాళ ఉదయం క్రేన్ సహాయంతో మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. గురువారం సాయంత్రం ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా తరుణ్(21) బావిలో పడిపోయినట్లు గుర్తించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడిన యువకుని మృతదేహం లభ్యం - పాక్పట్ల గ్రామంలో యువకుడు మృతి
ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిన యువకుని మృతదేహం లభ్యమైంది. ఇవాళ ఉదయం క్రేన్ సహాయంతో వెలికి తీశారు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం పాక్పట్ల గ్రామంలో జరిగింది.
నిర్మల్ జిల్లాలో బావిలో పడి యువకుడు మృతి
పాక్పట్ల గ్రామ శివారులో ఉన్న గొల్ల మల్లయ్య వ్యవసాయ పొలాన్ని దున్నుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు ఎస్సై అసిఫ్ తెలిపారు. బావిలో నీరు ఎక్కువగా ఉండడం వల్ల మోటార్ల సహాయంతో తోడేశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.