ఆకాల వర్షాలు ఆ ఇంట తీరని దుఃఖాన్ని మిగిల్చాయి. పాడిపైనే ఆధారపడి బతుకుతున్న వారి బతుకులను ప్రశ్నార్థకం చేశాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బాలాజీ తండాలో పిడుగు పాటుకు ఎనిమిది ఆవులు మృతి చెందాయి.
పిడుగుపాటుకు 8 ఆవులు మృతి - Pidugupadi cows died
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బాలాజీ తందాలో విషాదం జరిగింది. ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం కురిసిన సమయంలో పిడుగు పడి 8 ఆవులు మృతి చెందాయి.
పిడుగుపడి ఆవులు మృతి
గ్రామానికి చెందిన సావిత్రమ్మవి 4 ఆవులు, ధనమ్మకు చెందిన రెండు, ఐలమ్మకు చెందిన రెండు ఆవులు మృతిచెందాయి. పిడుగు పాటుకు మూగజీవాలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని ప్రజాసంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.