వివాహితపై అత్యాచారం, కిడ్నాప్, తుపాకీతో బెదిరింపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్‌రావును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. హయత్‌నగర్ కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించడంతో వనస్థలిపురం పోలీసులు.. చర్లపల్లి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగేశ్వర్‌రావును విచారణ కోసం ఠాణాకు తీసుకొచ్చారు. అత్యాచారం, హత్యాయత్నం జరిగిన ప్రదేశంతో పాటు కారు ప్రమాదం జరిగిన స్థలంలో పోలీసులు సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.
వనస్థలిపురం పీఎస్ పరిధిలో నివాసముండే మహిళపై అత్యాచారం చేయడంతో పాటు హత్యాయత్నం చేసినట్లు వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు నాగేశ్వర్‌రావును ఈ నెల 10న అరెస్టు చేసిన పోలీసులు.. 11న రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో పురోగతి కోసం నాగేశ్వర్‌రావును కస్టడీకి ఇవ్వాలని హయత్‌నగర్ కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా.. కోర్టు అంగీకరించింది.
సంబంధిత కథనాలు..
- రివాల్వర్ గురిపెట్టి వివాహితపై అత్యాచారం.. మారేడుపల్లి సీఐ అరాచకం
- మారేడుపల్లి ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు అరెస్ట్
- మారేడ్‌పల్లి మాజీ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్..
- మాజీ పోలీస్‌కు అంతర్గత సహకారం.. ప్రాణహాని ఉందంటూ బాధితుల ఆందోళన
- సీఐ నాగేశ్వర్‌రావును కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టులో పిటిషన్..
- ఆ కేసు నుంచి ఈజీగా బయటపడతా.. జైలులో పోలీసు అధికారి బిందాస్..!