ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంచికచర్ల రంగానగర్కు చెందిన జొన్నలగడ్డ నారాయణ కరోనా పాజిటివ్ వచ్చిందని ఆత్మహత్యకు యత్నించాడు. తీవ్రమైన జ్వరం తాళలేక గొంతు కోసుకున్నాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు.. హుటాహుటిన నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కరోనా సోకిందని.. ఆత్మహత్యాయత్నం.! - corona Positive Patient attempted suicide in Krishna District
కరోనా సోకి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న వ్యక్తి బలవన్మరణానికి యత్నించాడు. తీవ్రమైన జ్వరాన్ని తట్టుకోలేక కత్తితో గొంతు కోసుకున్నాడు. ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల రంగానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
కరోనా సోకిందని ఆత్మహత్యాయత్నం
గాయం పెద్దది కావడంతో ప్రథమ చికిత్స చేసిన వైద్యులు.. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. నారాయణ కంచికచర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో గుమాస్తాగా 30 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశారు.
ఇదీ చదవండి:Corona:కరోనా సమయంలో వైద్య విద్యార్థుల సేవలు