హైదరాబాద్లో గొలుసు దొంగల ఆగడాలు తగ్గడంలేదు. ఆభరణాలు ధరించిన మహిళలు కన్పిస్తే చాలు ద్విచక్రవాహనంపై వచ్చి మెడలోని గొలుసులు ఎత్తుకెళ్తున్నారు. తాజాగా సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కేశవనగర్ ఎక్స్ రోడ్ వద్ద ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఓ దుండగుడు గొలుసును ఎత్తుకెళ్లాడు.
నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో గొలుసు దొంగతనం - Hyderabad latest news
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కేశవనగర్ ఎక్స్ రోడ్డు వద్ద దొంగతనం జరిగింది. నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును దుండగుడు ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
![నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో గొలుసు దొంగతనం the-chain-theft-took-place-at-keshavnagar-x-road-under-saidabad-police-station](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10841258-715-10841258-1614689893347.jpg)
మహిళా మెడలో గొలుసు దొంగతనం
నడుచుకుంటూ వెళ్తున్న మహిళా మెడలో గొలుసు దొంగతనం
స్థానిక భాను నగర్ కాలనీకి చెందిన మాలతి అనే మహిళా 3 తులాల బంగారు గొలుసును మధ్యాహ్నం అందరూ ఉండగానే దొంగిలించాడు. ద్విచక్రవాహనంపై వచ్చిన దొంగ ఆమె మెడలో గొలుసు లాక్కుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి:అనిశా అధికారులకు చిక్కిన అవినీతి తిమింగలాలు