ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ద్వారకానగర్‌లోని పాల విక్రయ కేంద్రానికి ఓ పెద్దాయనతో పాటు ఆటో డ్రైవర్ వచ్చాడు. దుకాణం యజమానిని మాటల్లో పెట్టి బిస్కెట్ ప్యాకెట్, మిఠాయిల డబ్బాను చోరీ చేశాడు. ఈ క్రమంలో ఓ ప్యాకెట్ కిందపడిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టి దుకాణం యజమాని వారిని ప్రశ్నించింది.
దొంగలను పట్టించిన నిఘానేత్రం... ఏం దొంగలించారో తెలుసా! - ఆదిలాబాద్ జిల్లా తాజా వార్తలు
సాధారణంగా బంగారం, డబ్బు లేదా విలువైన వస్తువులు దొంగిలించడం చూస్తుంటాం. కానీ ఓ ఆటో డ్రైవర్ చేసిన చోరీ తెలిస్తే నవ్వురాకమానదు. ఇంతకీ ఆ ఆటో డ్రైవర్ చేసిన దొంగతనం ఏంటో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.
![దొంగలను పట్టించిన నిఘానేత్రం... ఏం దొంగలించారో తెలుసా! The cctv caught the biscuit thieves in adilabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10628354-684-10628354-1613320754212.jpg)
బిస్కెట్ దొంగలను పట్టించిన నిఘానేత్రం
బిస్కెట్ దొంగలను పట్టించిన నిఘానేత్రం
తాము ఏమి దొంగిలించ లేదని ఆటో డ్రైవర్ బుకాయించాడు. అనంతరం సీసీ కెమెరాల్లో రికార్డు అయిన చోరీ దృశ్యాలు చూసి తప్పును ఒప్పకున్నారు. అయితే పాలదుకాణం యజమాని వారిని క్షమించి వదిలేసింది.
ఇదీ చదవండి:తనిఖీలు నిర్వహిస్తోన్న ఎస్సైని ఢీకొట్టిన ద్విచక్రవాహనం
Last Updated : Feb 14, 2021, 10:59 PM IST