ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సోమవారం సాయంత్రం గోవాలో సునీల్ యాదవ్‌ను అరెస్ట్ చేసినట్లు సీబీఐ ధ్రువీకరించింది. మంగళవారం ఉదయం గోవా స్థానిక కోర్టులో హజరుపరిచి... సునీల్‌ను సీబీఐ అధికారులు ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నారు. సునీల్ యాదవ్‌ను కడప కోర్టులో సీబీఐ అధికారులు బుధవారం హాజరుపర్చనున్నారు.
మరోవైపు 58వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. 2019 మార్చి 15న వివేకానందరెడ్డి కడప జిల్లా పులివెందులలోని తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు.