ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో 72వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో.. ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు విచారణ చేస్తున్నారు. కేసులో భాస్కర్‌రెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. మరోవైపు.. కడప జైలులో విచారణకు హాజరైన జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్ హాజరయ్యారు.
అంతకు ముందు...
వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు సోమవారం వరకు... పది రోజుల పాటు విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో అతన్ని కడప కేంద్ర కారాగారం నుంచి పులివెందులకి తీసుకెళ్లారు. ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. పది రోజులపాటు పులివెందులలోని పలువురు అనుమానితుల ఇళ్లల్లో ఆయుధాలు, దుస్తులు, వస్తువులు అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిరోజులపాటు విచారణలో కీలక సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు పులివెందుల కోర్టులో హాజరుపరిచారు.