తెలంగాణ

telangana

ETV Bharat / crime

బీరు సీసాతో తలపై కొట్టి.. సీసా పెంకులుతో గొంతు కోశారు - missing murder case in sangareddy district

సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన వ్యక్తిని వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. చరవాణి సాయంతో పోలీసులు కేసును చాకచక్యంగా ఛేదించారు. నిందితులను రిమాండ్​కు తరలించారు.

The case of a missing person in Sangareddy district has turned into a murder case. Police said the murder was due to an extramarital affair
బీరు సీసాతో తలపై కొట్టి.. సీసా పెంకులుతో గొంతు కోశారు

By

Published : Mar 6, 2021, 8:17 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన వ్యక్తి మృతి చెందాడు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఏం జరిగింది...?

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం సుల్తాన్​పూర్ గ్రామానికి చెందిన రమేశ్ బార్బర్​గా జీవితం వెళ్లదీస్తున్నాడు. ఇదే గ్రామంలో ధర్మ కాంటలో పనిచేసే మెదక్ జిల్లాకు చెందిన మహేందర్​తో స్నేహంగా ఉండేవాడు. ఈ క్రమంలో మహేందర్ భార్య శోభతో రమేశ్​కు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గమనించిన మహేందర్ ఎలాగైనా హత్య చేయాలని తన స్వగ్రామానికి చెందిన సుభాశ్, ప్రకాశ్​లతో ప్రణాళిక రచించాడు.

పథకం ప్రకారం...

గత నెల 25న రమేశ్​ను ఇన్నోవా వాహనంలో జహీరాబాద్ మండలం హోతి గ్రామ శివారుకి తీసుకెళ్లి అక్కడ మద్యం తాగించారు. మత్తులో ఉండగా బీరు సీసాతో అతని తలపై కొట్టి సీసా పెంకులుతో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం జిల్లాలోని వైకుంఠపురం దేవాలయానికి దర్శనానికి వెళ్లి.. కొత్త వస్త్రాలు వేసుకుని రక్తపు మరకలు ఉన్న దుస్తులను దేవాలయం వెనుక వ్యవసాయ పొలంలో పడేశారు.

కనిపించట్లేదని..

రమేశ్​ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అమీన్​పూర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు కేసుగా నమోదు చేసిన పోలీసులు మృతుని చరవాణి ఆధారంగా నిందితులను పట్టుకుని రిమాండ్​కు తరలించారు.

ఇదీ చదవండి:గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య..

ABOUT THE AUTHOR

...view details