రంగారెడ్డి జిల్లా చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వాసవి కాలనిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో కారు అదుపుతప్పి ఓ దుకాణంలోకి దూసుకెళ్లింది. కారు షాపులోకి దూసుకువెళ్లడంతో సామగ్రి ధ్వంసమైంది. సంబంధిత దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
చైతన్యపురిలో కారు బీభత్సం.. సీసీలో దృశ్యాలు నిక్షిప్తం - The car rushed into the shop in vasavi colony
అతివేగంతో వెళ్తున్న కారు.. అదుపు తప్పి షాపులోకి దూసుకువెళ్లిన ఘటన చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన చోట ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది.
కారు బీభత్సం, చైతన్యపురి
ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు.. ఘటన జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:డీసీఎంను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి