నిజామాబాద్ పట్టణంలోని 3వ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీ చౌరస్తాలో ఉన్న దేవీ ప్రియ మెడికల్‌లో సరిత అనే మహిళ మందులు కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో ఓ కారు వేగంగా మెడికల్ దుకాణంలోకి దూసుకెళ్లి సరితను ఢీ కొట్టింది. అదే వేగంతో అక్కడ పార్కింగ్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలను ఢీకొట్టగా.. ఓ బైకు నుజ్జునుజ్జయింది. అనంతరం డ్రైవర్ కారుతో క్షణాల్లో అక్కడి నుంచి పరారయ్యాడు. కారు ముందు బంపర్, నెంబర్ ప్లేట్లు ఘటనా స్థలంలోనే పడిపోయాయి.
మెడికల్ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. మహిళకు తీవ్రగాయాలు - Nizamabad district crime news
నిజామాబాద్ నగరంలో ఆదివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ఓ మెడికల్ దుకాణంలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా.. ఓ ద్విచక్ర వాహనం ధ్వంసమైంది.
మెడికల్ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు
ఈ బీభత్సంలో సరిత తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
ఇదీ చూడండి:ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన బొలెరో వాహనం.. ఇద్దరు మృతి