CC Footage: మద్యం మత్తులో డ్రైవింగ్.. బాలుడిపైకి దూసుకెళ్లిన కారు - కారు ప్రమాదం వార్తలు
![CC Footage: మద్యం మత్తులో డ్రైవింగ్.. బాలుడిపైకి దూసుకెళ్లిన కారు The car crashed into a boy standing in front of the house In Rajendranagar, Hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12329644-951-12329644-1625197102590.jpg)
08:01 July 02
కారు బీభత్సం
హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని... ప్రేమావతిపేటలో గత నెల 27న జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్... ఇంటి ముందు కూర్చున్న బాలుడిని ఢీకొట్టాడు. రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాద శబ్ధానికి స్థానికులు ఒక్కసారిగా బయటికి వచ్చారు. కారులో ఉన్న వాళ్లు పారిపోతుండగా.. అందులో డ్రైవర్ను స్థానికులు పట్టుకున్నారు. మద్యం సేవించినట్లు గుర్తించి చితకబాదారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో... ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
ఇదీ చూడండి:MURDER : గొంతులో పొడిచి.. మెడకు చున్నీ బిగించి.. ప్రేమోన్మాది ఘాతుకం