తెలంగాణ

telangana

ETV Bharat / crime

గుడిసెను తగులబెట్టేసిన కొవ్వొత్తి.. 80 ఏళ్ల వృద్ధుడు సజీవదహనం

Fire Accident: ప్రమాదవశాత్తు గుడిసెకు అంటుకున్న మంటల్లో వృద్ధుడు సజీవ దహనమైయ్యాడు. ఈ విషాదకర ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది.

The candle that burned the hut and 80 year old man was cremated alive
The candle that burned the hut and 80 year old man was cremated alive

By

Published : May 2, 2022, 5:28 AM IST

Updated : May 2, 2022, 6:23 AM IST

Fire Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని వడ్డెర బజారులో జెల్లీ పెద్ద బిక్షం(80) అతని భార్య జయమ్మ.. ఓ పూరిగుడిసెలో నివసిస్తున్నారు. ఆదివారం( మే 1న) రాత్రి గాలివాన రావడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఇంట్లో కొవ్వొత్తు వెలిగించి.. ప్రక్క వీధిలో ఉంటున్న కుమారుడి ఇంట్లో నిద్రించేందుకు జయమ్మ వెళ్లింది. కాగా.. బిక్షం గుడిసెలోనే ఉన్నాడు.

గుడిసెకు చుట్టూ ఏర్పాటు చేసిన బరకాలకు.. ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకొని మంటలు వ్యాపించాయి. అప్పటికే గుడిసెలో నిద్రిస్తున్న బిక్షం మంటలు పెరిగిపోవటం వల్ల.. బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల ఉన్నవారు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా వీలుపడలేదు. అగ్నిమాపక శకటం వచ్చి మంటలను అదుపు చేయగా.. అప్పటికే మంటల్లో పెద్దబిక్షం సజీవదహనమయ్యాడు.

ఇదీ చూడండి:

Last Updated : May 2, 2022, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details