కూడబెట్టిన డబ్బు, నగలు ఇవ్వడంలేదని కట్టుకున్న భార్యను భర్తే హత్యచేశాడు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్కేపల్లిలో వృద్ధ దంపతులు జీవిస్తున్నారు.
పైసలివ్వలేదని ఊదుడు గొట్టంతో కొట్టి చంపేశాడు! - sangareddy district crime updates
కట్టుకున్న భార్యనే కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. పైసలివ్వలేదనే కోపంతో కట్టెలపొయ్యిలోని ఊదుడు గొట్టం.. పీటతో కొట్టి చంపేశాడు. సంగారెడ్డి జిల్లా చిల్కేపల్లిలో ఈ దారుణం జరిగింది.

పైసలివ్వలేదని ఊపుడు గొట్టంతో కొట్టి చంపేశాడు!
పైసలు ఇవ్వాలని భార్యను భర్త అడిగాడు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైన భర్త మల్లయ్య.. భార్య తుల్జమ్మ(60)ను దారుణంగా హత్య చేశాడు. ఊదుడు గొట్టం, పీటతో కొట్టి హతమార్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జహీరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. ఎస్సై గోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:'ఫాస్టాగ్ లేకపోతే డబుల్ రుసుం చెల్లించాలి'
Last Updated : Feb 15, 2021, 1:58 PM IST