bride suicide in makthal: నారాయణ పేట జిల్లా మక్తల్ పురపాలిక పరిధిలోని చందాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పద్మమ్మ, వెంకటయ్య దంపతుల రెండో కుమార్తె భీమేశ్వరి. ఆమె వయసు సుమారుగా 19 సంవత్సరాలు. అయితే అదే పురపాలిక పరిధిలోని దండు గ్రామానికి చెందిన యువకుడితో పది రోజుల కిందట నిశ్చితార్థం జరిగింది. మంగళవారం పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకుంది. కానీ ఇంతలో ఆశలన్నీ ఆవిరయ్యాయి.
సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులకు భీమేశ్వరి ఇంట్లోని వెంటిలేటర్‌కు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంది. బలవన్మరణానికి ముందు భీమేశ్వరి ఓ సూసైడ్ నోట్ రాసింది. ఆమె దగ్గర లభించిన లేఖ (సూసైట్ నోట్)లో.. తనకు నిశ్చితార్థం అయినప్పటికీ... చందాపూర్‌కు చెందిన లిక్కి అలియాస్ సిరిపి నర్సింహులు అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని పేర్కొంది. అది భరించలేకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు లేఖలో రాసింది.