తెలంగాణ

telangana

ETV Bharat / crime

గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడికి కరెంట్‌ షాక్‌ - గాలిపటం కోసం స్తంభం ఎక్కిన బాలుడికి కరెంట్‌ షాక్‌

boy got electric shock while taking a kite
గాలిపటం తీస్తుండగా బాలుడికి విద్యుదాఘాతం

By

Published : Jan 15, 2022, 1:19 PM IST

Updated : Jan 15, 2022, 2:35 PM IST

13:16 January 15

గాలిపటం తీస్తుండగా బాలుడికి విద్యుదాఘాతం

గాలిపటం తీస్తుండగా బాలుడికి విద్యుదాఘాతం

Electric shock to boy: గాలిపటం కోసం విద్యుత్‌ స్తంభం ఎక్కిన ఓ బాలుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. చిన్నారికి ప్రాణాపాయం తప్పి తీవ్రగాయాలయ్యాయి. ములుగు జిల్లా కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ములుగుకు చెందిన పన్నెండేళ్ల బాలుడు.. గాలిపటం ఎగురవేస్తుండగా అది విద్యుత్‌ స్తంభానికి చిక్కుకుపోయింది. దీంతో పతంగి కోసం బాలుడు విద్యుత్‌ స్తంభం ఎక్కి.. కరెంట్‌ షాక్‌కు గురయ్యాడు.

అప్రమత్తమైన లైన్‌మెన్‌ కరెంటు సరఫరా నిలిపేసి బాలుడిని కిందికి దింపారు. అపస్మారకస్థితిలో ఉన్న చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు కావడంతో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది.

ఇదీ చదవండి:Cybercriminals new plans: పండగపూట ఆఫర్లని ఆశపడితే... హాంఫట్!!

Last Updated : Jan 15, 2022, 2:35 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details